పుట:మధుర గీతికలు.pdf/605

ఈ పుట ఆమోదించబడ్డది



పొట్టపొంగున తన తల్లి పొదుఁగు వాసి
గురువువాఱుచు వత్సంబు పరువులెత్తు;
తల్లి యెలుగెత్తి పలుమఱు తన్ను బిలువ,
నిలిచి తల యెత్తి చూచుచు పొలసియాడు.

సుడిసి యెవరైన తను బట్టఁ గడఁగిరేని,
వీఁక చేయీక కుప్పించి చౌకళించు;
బిడ్డ లెవరైన దారిలో నడ్డ మైన,
మిట్టిమీనయి జంకించి మింటి కెగయు,

పుడమిపై ముట్టె నానించి మూరుకొనుచు
చెండు మీటినగతి పై కి చెంగలించు,
గరికిపఱకల నెడనెడఁ గొఱుకఁ దివురు,
నేలఁ బొరలాడు, క్రమ్మఱ నిలిచి పాఱు.

ఇట్లు శైశవక్రీడల నెసఁగుచున్న
వుత్రుఁ బొడఁగని కన్నీరు పొంగి పొరల,
'ఇట్టి నెత్తురుకందు నే నిచట డించి,
పోవలసెనె కటకటా ! దైవగతికి ?

50