పుట:మధుర గీతికలు.pdf/603

ఈ పుట ఆమోదించబడ్డది



సత్యదేవత యెదుట సాక్షాత్కరించె
ననఁగ, వెలుఁగొందుచున్న యయ్యావు జూచి,
అచ్చెరువు ఱిచ్చపాటును పిచ్చలింప
పలికె నీరీతి శార్దూలవల్లభుండు.

'చాలు చాలును గోవ : నీ సత్యనిష్ఠ
కిచ్చమెచ్చితి; నీ యింటి కేగి, వేడ్క
కన్నబిడ్డకు కడుపార చన్ను గుడిపి,
తిరుగ రావమ్మ నా కోర్కె దీర్ప వేగ.

కడుపుతీపిని నీ విట్లు పడ్డెడు బాధ
కడుపుమంటను నే నిప్డు పడెడు బాధ
కంటె నధికంబు కావున, నింటికడకు
పోయి రా వమ్మ వేగ నో పుణ్యురాల

వనధి లో తెంతొ యెన్నఁగవచ్చుఁ గాని,
తల్లి దయలోతు నెన్నెంగఁ దరము కాదు;
మాతృప్రేమకు సాటి యీ ధాత్రిఁ గలదె ?
పోయి రావమ్మ వేగ నో పూజ్యురాల!

48