పుట:మధుర గీతికలు.pdf/602

ఈ పుట ఆమోదించబడ్డది



పరసతులఁ బట్ట నుంకించు పరమపాపి,
అన్యధనములు గాంక్షించునట్టి చెనఁటి,
తిన్నయింటికి వాసాల నెన్ను తులువ,
అప్పు లోనరించి యెగఁ బెట్టు నాకతాయి,

కూటసాక్ష్యము లిచ్చెడు కుటిలబుద్ధి,
కొండియంబుల నాడెడు కుత్సితుండు,
అతిథు లింటికి నేతేర నన్న మిడక
కుక్షి నిండంగఁ గుడుచు కక్కర్తి కాఁడు,

తాను గుడువక, యొరులకు దాన మీక
పసిఁడి కప్పలుగాఁ గూర్చు పిసినిగొట్టు,
అగ్నిసాక్షిగ పరిణయమాడినట్టి
కులసతిని వీడి పెరయాలిఁ గూడు కూళ,

కడుపుకూటికై కాటికి కాళ్ళుసాఁచు
ముదుసలికి కూఁతు తెగనమ్ము ముష్కరుండు
పోవువారల గతులకు పోవుదాన
నింటికడకేగి మగుడ రా కుంటినేని.

47