పుట:మధుర గీతికలు.pdf/601

ఈ పుట ఆమోదించబడ్డది


అనుడు, మోమున దరహాస మంకురింప,
పులికి వందన మొనరించి పలికెనావు :
'బళిర ! నీ మేలు మఱవంగఁ గలనె యెపుడు?
వినుము నే నిదె బాస గావించుచుంటి.

గోవులను వస్తువెట్టెడి కూళగతికి,
గొడ్ల ముకుత్రాళ్ళ బంధించు కుజనుగతికి,
దూడ లేనావు పితికిన దుష్టగతికి,
పోవుదానను నే రాకపోతి నేని.

దేవదూషణ సేయు నాస్తికునిగతికి,
గురుల ధిక్కార మొనరించు కుమతిగతికి,
సాధువుల బాధపెట్టు నృశంసుగతికి,
పోవుదానను నే రాకపోతి నేని.

తల్లిదండ్రుల నిందించు ప్రల్లదుండు,
బంధువులఁ బ్రోవ నేరని బ్రహ్మబంధు,
వర్ణిజనముల మనుపని వ్యర్థజీవి,
అల్పజంతువులకు హింస సల్పు ములుచ,

46