పుట:మధుర గీతికలు.pdf/599

ఈ పుట ఆమోదించబడ్డది



ఇట్టు లేమిటి కింకను నెట్టుకొనెదు ?
నీదు కఱుదుల నా కుక్షి నిండుకొనునె ?
బిడ్డపై జడ్డు విడలేక పెనఁగె దౌర ?
ప్రిదులవచ్చునె నా ముందు వెఱ్ఱిగోవ?

నావు డా మాట లాలించి యావు పలికె
అలుకమై తన్ను గద్దించు పులిని జూచి
పలుకుపలుకున కన్నీరు తొలకరింప,
పలుకుపలుకున దైన్యంబు గులకరింప.

‘అగునె నీ విట్టు లాడంగ వ్యాఘ్రరాజ :
పశుగణంబులయందును, పక్షులందు
పలుకు తిరుగక చరియించువారు లేరె?
బోయ కీయదె తన మేను మును కపోతి

ఆడి తిరిగిన చండాలుఁ డండ్రు గాని,
కులము చండాలుఁ డైనను కొఱఁత లేదు;
ఆడి తిరుగక యుండెనా, వాఁడె పుడమి
పూజ్యుఁ డను మాట వినలేదె పులులఱేడ!

44