పుట:మధుర గీతికలు.pdf/598

ఈ పుట ఆమోదించబడ్డది



విడిచినంతన ‘బ్రతుకు జీవుఁడ' యటంచు
సరగ తనయునికడ కేగి చన్ను గుడిపి,
కాంక్ష మీఱఁగ నుందువు గాక, యకట :
తిరిగి వత్తువె యిచ్చటి కెఱిఁగి యెఱిఁగి ?

‘బదికియుండిన శుభములు బడయవచ్చు,
తఱకలును చొప్ప చాలును, మఱచి యైన
తలపొలము వీడి యడు గైన దాఁట' నంచు
తలఁచెదవు కాని, నా మాట తలఁతు వొక్కొ?

మహిత విజ్ఞానయుతులైన మనుజులందె
మాట తప్పంగ నేరని మానధనులు
కానరా రన్న, మాటికి గడ్డి కఱచు
పసరముల మాట వేఱ చెప్పంగ నేల ?

ఆఁకటను ప్రేగు నకనకలాడుచుండె,
ఇట్టు న న్నింక నఱ్ఱాఁక పెట్టఁ దగునె?
తడవు సేయఁగ నేటికి ? తనివి దీఱ
నంజుకొనియెద నీ మేనినంజు డెల్ల .

43