పుట:మధుర గీతికలు.pdf/595

ఈ పుట ఆమోదించబడ్డది



ఏమి చెప్పుదు నాతని ప్రేమగరిమ
ఎట్టి రుచిరపదార్థము నేనిఁ దాను
మున్నుగా నాకు పెట్టక ముట్టఁ డెపుడు;
తడవ నేటికి యిప్పుడా గొడవ యెల్ల ?

పుట్టె నా కొక తొలిచూలి ముద్దుపట్టి,
మూఁడునాళ్లైన చనలేదు వాఁడు పుట్టి,
బొడ్డుమావియు నూడని పురిటిపాప -
పూరి ముట్టఁడు, త్రావఁడు నీరువట్టు.

తువ్వ కా దది, తేనియగవ్వ గాని;
గవ్వ కా దది, నును వెండిమువ్వ గాని;
మువ్వ కా దది, తెలిమల్లె పువ్వు గాని;
పువ్వు కా దది, జిగివెన్నముద్దగాని.

పాలు గుడిపితి తెలతెల్ల వాఱువేళ;
ఇంతలో నందు నిందును గంతు లిడఁగ
అకట : ఆ పాలు పుడిసెడు నఱిగిపోవ,
తూలుచున్నాఁడొ యాఁకట సోలి కొడుకు ?

40