పుట:మధుర గీతికలు.pdf/594

ఈ పుట ఆమోదించబడ్డది



కోలుపులి యంట, ఆఁకలి సోలె నంట,
చియ్యబట్టిన యావు చేఁజిక్కె నంట,
నిలువు మన నావు, పులి యట్టె నిలిచె నంట,
ఎన్నఁడేనియు వింటిమే యిట్టి వింత ?

మరణ మన ధేను వించుక వెఱపు గొనక
సాహసంబునఁ జూపిన శాంతమునకు
పులియె యద్దిర : పిల్లియైపోయె ననఁగ,
శాంతమున గెల్వరానిది జగతిఁ గలదె?

అంత పులితోడ నీరీతి ననియె మొదవు :
'ఓయి పులిరాజ ! ఈ పొంతయూరఁ గలడు
పాఱుఁ డొక్కఁడు సన్నుతాచారపరుఁడు;
మురిపమున వాఁడు పెనుపంగ పెరుగుచుంటి.

నిరత మాతఁడు నులివెచ్చనీటఁ గడిగి,
కసవుపోచల నా మేనికసటు వోవ
సవరగాఁ దోమి, గంగడోల్ నివిరి, దువ్వి
అంటుసంటుల కొనగోట నంటి తివియు,

39