పుట:మధుర గీతికలు.pdf/592

ఈ పుట ఆమోదించబడ్డది

గో గీతము.



అనఁ గనఁగ, నొక్క చక్కని యావు కలదు;
కుఱుచకొమ్ములు, బటువైన గుల్ల పొదుగు,
మెత్తనై కుఱుమట్టంపు మేను కలిగి
కనులపండువు సేయు నా గంగిగోవు.

పొడువ దెవ్వరి, కయ్యంబుపొంతఁ బోదు,
చెనఁటియావులతో చెల్మి చేయ దెపుడు
బుడుతఁ డైనను పిదుకుచో పొదుఁగు చేఁపి
కుంభధారఁగ క్షీరముల్ కురియఁజేయు.

మిసమిసను దాని నిద్దంపుమేను జూచి
మవ్వ మగు దాని జిగి కండక్రొవ్వు జూచి
పోతరించిన దాని మూఁపురము జూచి
గండుపులి యొండు దానిపై కన్నువైచె.

37