పుట:మధుర గీతికలు.pdf/589

ఈ పుట ఆమోదించబడ్డది


పగతుఁ దునుమాడి నాథుండు మగుడ నన్ను
గై కొను నటన్న పేరాసకతనఁ గాదె
అపుడు బ్రదికితి, నే, డేమి యాస గలదు ?
గంగమడు గుండె, నా మేనిబుంగ యుండె.

వగపుచే నిట్లు నోరికి వచ్చినట్లు
వదరితిని గాక, లోకాపవాదమునకు
పతిని గుఱిసేయ నే నెట్లు పాలుపడదు ?
విభునియానతిఁ బడియుందు విపినమందు.

జాల మేటిక లక్ష్మణా ! సరగ చనుము,
మువ్వురత్తలకును నాదు మ్రొక్కులనుము,
అనుఁగుమఱఁదుల నిరువుర నడిగి తనుము,
ప్రాణవిభునకు మ్రొక్కి యీ పగిది ననుము.

ప్రజల బిడ్డలఁ బోలెఁ గాపాడు మనుము,
తలప నా కేడుగడ యెప్డు తానె యనుము,
భావ మెప్పుడు తన మూర్తి బాయ దనుము,
నెమ్మి యొకయింత నామీఁద నిలుపు మనుము.

34