పుట:మధుర గీతికలు.pdf/587

ఈ పుట ఆమోదించబడ్డది


ఆ కరుణ, యా ప్రసన్నత, యా ప్రియంబు,
ఆ రసికత, యా ప్రేమ, యా గారవంబు
మఱచెఁ గాఁబోలు నింతిలో మానధనుఁడు
తులువ లాడిన తుచ్ఛనిందలకుఁ దలఁకి.

అవని నే నయోనిజ నయి యవతరించి
జనకు నింటను పెరిగిన జాడ వినఁడొ?
తొల్లి యనసూయ మన్ననతోడ నాకు
అంగరాగ మొసంగు తెఱంగు కనఁడొ?

దుష్టదై త్యునిచెఱనుండి తొలఁగునాఁడు
సురలు గనుగొన వహ్ని నే నుఱుకలేదొ ?
నాఁ డెఱుంగదె లోకంబు నాదు శీల?
మింత తెగువకు ధవుఁ డేల యిచ్చగించె ?

అంత యేటికి - వనముల కనుచునాఁడు
పొలుపుమై తాను న న్నెంతొ బుజ్జగించి
ఎన్ని నయగారములు పల్కె? ఎన్ని వగలు
చేసె? అన్నియు. నిజ మంచు మోసపోతి.

32