పుట:మధుర గీతికలు.pdf/586

ఈ పుట ఆమోదించబడ్డది


కళవళము నొందియుంటివొ, కాకయున్న
కలయొ, భ్రాంతియొ, నిక్కంబు తెలుపు మయ్య !
అక్కటా! ఎన్నఁడేని నా యనుఁగువిభుఁడు
నన్ను కానలఁ ద్రోయునే! నమ్మఁ జాల,

కొందలమ్మున డెందమ్ము కుదురు వాయ,
ఎఱుఁగ కాడితి, నను క్షమియింపు మయ్య;
చండకరున కైన కళంక ముండుఁ గాని,
నీ కొక కళంక ముండునే నిర్మలాత్మ !

ముక్కు మొగము నెఱుంగని మొఱకు లెవరొ
కొంద రెగ్గులు పల్క పల్కుదురు గాక !
అంతమాత్రనె నమ్మి నా కాంతుఁ డిట్లు
కానలకు నన్ను ద్రోయునే కరుణ మాలి?

అరమరలు లేని కూరిమి ననఁగి పెసఁగి,
కొదలు దీరని కోర్కులఁ గూడిమాడి,
కపట మెఱుఁగని మమతల గలసి మెలసి
యున్న విభుఁ డిట్లు చేసిన నోర్చు టెట్లు?

31