పుట:మధుర గీతికలు.pdf/584

ఈ పుట ఆమోదించబడ్డది


భవుని కోదండమును వంచె, వాలి నొంచె,
శరధి బంధించె, పంక్తి కంధరుని ద్రుంచె
నీ నిమిత్తమ కా దమ్మ? నిన్ను బాసి
రాముఁ డక్కట ! ఏరితి బదుకఁ గలఁడు !

కటికి పగవాని కైనను కలుగ రాని
యిట్టి యాపద నెట్లు సహింతు వమ్మ ?
అన్న యానతి యిచ్చెఁ బో, అట్టె నేను
ఇట్టి కట్టిడిపని కేల యియ్యకొంటి ?

అలరుఁదోఁటల విహరింప వలయు నీవు
ఘోరవనముల నేరీతిఁ గ్రుమ్మరిలెదు ?
కొదమచిలుకల పలుకుల బెదరు నీవు
పులులబొబ్బల కేగతి నిలువఁ గలవు?

అడవులం బడి యగచాట్ల నంది యంది,
క్రూరదై త్యుని బాధల కుంది కుంది,
చిచ్చులోఁ జొచ్చి వల్ల భుఁ జెందినావు;
కడకు కడతేఱ దయ్యె నీ కాఁపురంబు.

29