పుట:మధుర గీతికలు.pdf/583

ఈ పుట ఆమోదించబడ్డది


ఎట్టి పాతకమున కైన, నెట్టి ఘోర
కార్యమున కై న నొడికట్టు ఘాతకుఁ డని
యెంచెఁ గాఁబోలు, లేకున్న నిట్టి పనికి
విభుఁడు నియమించునే నన్నె వెదకి వెదకి? .

ఇట్టి తెగువకు బూనిన యట్టి నేను
వెనుకదీయుదునె వచింప? వినుము తల్లి _
లోకనిందను సైరింప లేక విభుఁడు
వనుల నిను డింపు మనఁ గొనివచ్చినాఁడ.

దానవునిచేతఁ జిక్కిన చానఁ దెచ్చి
ఏలుచున్నాఁడు రాఘవుఁ డెంత వెడఁగొ ?
అంచు జను లాడు నింద సైరించ లేక
వనుల నిను డించి ర మ్మనె జనవిభుండు.

పావనం బగు భవదీయవర్తనంబు
తెలిసియుండియు, లోకనిందలకుఁ దలఁకి
వనములకు నిన్ను మా యన్న పనిచెఁ గాక;
నిముస మేనియి నిను వీడి నిలుచువాఁడె ?

28