పుట:మధుర గీతికలు.pdf/582

ఈ పుట ఆమోదించబడ్డది


      మున్ను పదునాలుగేఁడులు మన్న యట్టి
      ఘోరవనములఁ గ్రమ్మఱఁ గుమ్మరిల్ల
      విభుని నే నేల వేఁడితి వెకలి నగుచు
      గొఱవి చేఁబూని తల గోఁకికొన్నరీతి?

      దిగులు పుట్టెడు నిను జూడ - తెలుపు మయ్య!
      కడుపు చల్లఁగ కౌసల్య కన్న కొడుకు,
      నీదు కూరిమి సై దోడు, నాదు విభుఁడు
      చెక్కుచెదరక యున్నాఁడె సేమముగను?

లక్ష్మణుఁడు

      ఏమి చెప్పుదు నమ్మరో! యిట్టి వా ర్త
      నుడువుకంటెను ప్రాణంబు విడుట మేలు,
      విమల మగు నీదు పాదాంబుజములచెంత
      నిదిగొ వాలితి, నను శపియింపు మమ్మ.

      మునులపల్లెలఁ జూపింతు ననుచుఁ బలికి
      మంచిమాటల నిన్ను నమ్మించి, యిట్లు
      నట్టడవిఁ ద్రోయ నెంచిన బెట్టిదుండ,
      అకట! నావంటి పాతకి యవనిఁ గలఁడె?

27