పుట:మధుర గీతికలు.pdf/581

ఈ పుట ఆమోదించబడ్డది


వీడితివొ రామపాదారవింద సేవ?
ఓడితివొ శత్రువులఁ దాఁకి యుద్ధమందు?
కూడితివొ మందబుద్ధిని కుటిలమతుల?
ఆడితివొ నిష్ఠురంబుల నార్తజనుల?

అన్నయానతి లేకయె నన్ను నిటకు
తోడి తెచ్చితొ? ప్రేముడి వీడి నన్ను
కానలకుఁ ద్రోసిపుచ్చెనొ ప్రాణవిభుఁడు?
నుడువుమా తండ్రి! నీ విట్టు లడల నేల?

'విమలగంగానదీతటీవిపినవాటి
మునుల పల్లెల వసియింవ మనసు పుట్టె
నాదు ముచ్చట దీర్పవే నాథ! యనుచు
వేఁడ, నీ వెంటఁ బంపఁడే విభుఁడు నన్ను?

ఏమి మాయయొ కాని - దవ్వేగుకొలఁది,
ఘోరభీకరరవముల గోండ్రు మనుచు
బొబ్బరింతలు వెట్టు బెబ్బులులె కాని,
కానరా దొక్క మునిపల్లె కానలోన.

26