పుట:మధుర గీతికలు.pdf/580

ఈ పుట ఆమోదించబడ్డది

అపవాదము



సీత
 
     ఏమి లక్ష్మణ! నేఁడు నీ మోము జూడ
     విన్న నై యున్న దేటికి చెన్ను దొరఁగి?
     అన్నదమ్ములు కుశలులై యున్నవారె?
     కన్ను దమ్ముల నశ్రువుల్‌ గ్రమ్మ నేల?

     అడవులను దొల్లి యిడుమలఁ గుడుచునాఁడు,
     శత్రునివహంబుతో నాజి సలుపునాఁడు,
     కూళరావణు, శ క్తిచే సోలునాఁడు,
     బన్న మొందవు. నేఁ డేల విన్నఁదనము?

     తల్లులుగ నాత్మ భావింతు వెల్లసతుల,
     దై వతము లంచు గురువులఁ దలఁతు వెపుడు,
     సోదరులరీతి నెల్లర నాదరింతు,
     వేమి యాపద ఘటియిల్లె నిట్టి నీకు?

25