పుట:మధుర గీతికలు.pdf/577

ఈ పుట ఆమోదించబడ్డది

సీత


అకట! కుడికన్ను మాటికి నదరఁ దొడఁగె,
చదల గ్రద్దలు గూబలు సంచరించె,
దుర్నిమిత్తము లెల్లెడ తోఁచుచుండె,
ఏమి కీ డొనగూడునో యెఱుఁగరాదు.

ఏల బంగారులేడి తా నేగుగేఁచె?
దాని బట్టఁగ విభు నేల తఱిమియుంటి?
ఏల విసవచ్చె నారీతి నీరెలుంగు?
మఱఁది నేటికి తిట్టితి కఱకునుడుల?

దొసఁగు లెన్నే ని పొసఁగిన పొసఁగు గాక,
వానికిఁ దలంక, వాకొనరాని నుడుల
చారుగుణశీలు సన్నుతాచారలోలు
మఱఁదిఁ దిట్టితి, దానికి మ్రగ్గుదాన.

ఆత్మసుఖమును వర్జించి, అన్న కొఱకు
అడవులం బడి యిడుమలఁ గుడుచుచున్న
దురితదూరుని లక్ష్మణు దూఱియుంటి,
కట్టి కుడుపకయున్నె యా కర్మఫలము?

22