పుట:మధుర గీతికలు.pdf/576

ఈ పుట ఆమోదించబడ్డది


దారుణంబులు, హృదయవిదారణంబు
లైన నీ వాక్కులకు గుఱి యగుటకంటె
అన్న కోపాగ్ని కాహుతి యైన మేలు
కానఁ బోయెద నేది యె ట్లైనఁ గాని.

తమ హితము తా మెఱుంగరు తమ హితంబు
గోరి యొరు లాడు పల్కుల చీరిగొనరు,
తాము చెప్పిన మాటలే తథ్య మనుచు
ఫెనఁగెదరు చాన, లెంతటి వెడఁగు లౌర!

క్రూరభీకరదావాగ్నిఁ గూలవచ్చు,
ఘోరకాకోలవిషమును గ్రోలవచ్చు,
ఉదధిగంభీరజలముల నుఱుకవచ్చు,
సతులకోపంబు సై రింప శక్య మగునె!

సెల వొసంగుము పోయివచ్చెదను తల్లి!
ప్రభుని దోడ్కొని మగుడ నే వచ్చుదాక
ఎవ్వఁ డై నను నిను ముట్టె నేని, వాఁడు
పుడమిపైఁ గూలుఁ గావుత బూది యగుచు

21