పుట:మధుర గీతికలు.pdf/574

ఈ పుట ఆమోదించబడ్డది


నిన్ను నొంటిగ విడనాడి యేను చనిన,
అదను కని పెట్టి వై రులు కదిసి నీకు
హాని తప్పక కావింతు రనెడి భీతి
వెడలకుంటిని, అంతియె - వేఱు కాదు

మనలఁ గికురింప నెవ్వఁడో మాయదైత్యుఁ
డన్న యెలుఁగున నను జీరె, మిన్ను విఱిగి
మీఁదఁ బడ్డ చలింపఁ డా మేటివీరుఁ,
డిట్టు లూరక వాపోవ నేటికమ్మ?

మూఁడులోకంబు లొక్కట మొనసి యైన
జానకీరాము గెలువంగఁ జాల వనిన,
ఇంక మ్రుక్కడిరక్కను లెంతవారు?
నిప్పుతునుకకు చెద లంట నేర్చు నమ్మ!

“రాముఁ డెన్నఁగ నాదినారాయణుండు
కాని కేవల సామాన్యమానవుండె?
అవనిభారంబు హరియింప నవతరించె'
ననుచు మౌనులు వచియింప వినవె తల్లి

39