పుట:మధుర గీతికలు.pdf/572

ఈ పుట ఆమోదించబడ్డది


కట్టుకొంగున చిచ్చును కట్టినట్లు
లెట్టి సాహసమున కొడిగట్టినావు?
కెరలుచుంటివె నీకు దక్కెద నటంచు?
నీచ అటులై వ వినుము నా నిశ్చయంబు,

ధవుఁడు నా కింక దక్కక తక్కె నేని
నెటులో గుక్కెడు ప్రాణంబు లీగుదాన,
కత్తి కఱ వౌనె? చిచ్పు చిక్కకయ యున్నె?
తల్లి చల్లని గౌతమి దరిని లేదె?

చెప్పవలసిన దంతయు చెప్పియుంటి-
నన్ను కాచు నెపంబున నాదుచెంత
నిలిచియుండుటొ, వైరులఁ బిలుకుమార్చి
విభుని గాచుటొ, ఏదో కావింపుమయ్య.

అన్నఁ గాపాడ వేగమే యరిగితేని,
చిరతరం బగు కీర్తి నార్జింపఁగలవు;
నీచచింతలఁ బాల్పడి నిలిచితేని,
ఘోర నరకానలంబునఁ గూలఁగలవు.

17