పుట:మధుర గీతికలు.pdf/571

ఈ పుట ఆమోదించబడ్డది


ఇంతకాలముదనుక నా కాంతుచెంత
మేకవన్నియపులి వయి మెలఁగినావు,
తెల్ల మయ్యెను నీతత్త్వ మెల్ల నేఁడు
అవుర! ఎంతటి కుటిలాత్ముఁడవుర నీవు?

‘వాఁడు చచ్చినతోన నా పీడ వదలు,
వాని భార్యను జేపట్టి వైభవంబు
మించ నేలేదఁగా' కంచు నెంచి తేమొ?
నిలువు నీ ఱయి కూలవే తులువ యపుడె?

తనకు నమ్మిన గారాబు తమ్ముఁ డంచు
కూర్మి నీ యన్న ని న్నెంతొ కొండ సేయు,
కాంక్షతో వాని మృతికయి కాచియుంటి,
వనుజుఁడవె నీవు, దనుజుఁడ వగుదు గాక.

తమ్ముఁ డొక్కఁడు రాజ్యంబు తస్కరించె,
బలిమి నొక్కఁడు భార్యఁ జేపట్ట నెంచె,
ఏమి కావింప నుండెనో యింక నొకఁడు?
మంచితమ్ములఁ గూర్చెరా మాలబమ్మ.

16