పుట:మధుర గీతికలు.pdf/569

ఈ పుట ఆమోదించబడ్డది


పెనఁగి మృత్యువు పై కొన్న వేళఁగాని
కలుగదెన్నఁడు నట్టి యాక్రందరవము;
ఇంతకును నాదు సౌభాగ్య మెట్లు కలదొ?
నాదు హృదయాధినాధుఁ డున్నాఁడో లేఁడొ?

పైఁడిలే డని యక్కటా! భ్రాంతి జెంది
పట్టు మని నీదు సోదరుఁ బంచియుంటి,
సుఖముగా నింట కుడిచి కూర్చుండ లేక
చెఱుచుకొంటిని సర్వంబు చేతులార.

అదిగొ! అల్ల దే: క్రమ్మఱ నార్తరవము
వినఁగవచ్చెడు వీనులు వ్రీలిపోవ;
లెమ్ము, బాణాసనము దాల్చి పొమ్ము వేగ,
తడసితేనియు కార్యంబు చెడునో యేమొ?

ఏల యీలీల లక్ష్మణా! బేల వోలె
దెసలు చూచుచు నుంటివి తెల్ల బోయి
కఱకుఱా లైన కరఁగు నా క్రందనంబు
వినఁబడెనొ లేదొ యింత నీ వీనుఁగవకు?

14