పుట:మధుర గీతికలు.pdf/568

ఈ పుట ఆమోదించబడ్డది

పైఁడిలేడి


సీత
'అదిగో! సౌమిత్రి ! వింటివే యా ర్తరవము
అకట! వీతెంచె 'హా! లక్ష్మణా!' యటంచు:
ఆ యెలుంగు నిజంబుగ నా యనుంగు
ప్రాణనాథుని కంఠస్వరమ్ము సుమ్ము.

కదిసి దైత్యులు పలువురు పొదివి తన్ను
చుట్టి చీకాకువెట్టంగ సొమ్మసిల్లి
సోలెనో యే మొ నీ కూర్మిసోదరుండు?
అట్లు గాకున్న నట్టి యా యఱపు లేల?

బెట్టిదం బగు నా ధ్వని పిడుగు వోలె
కాల్చుచున్నది నా యంగకముల నెల్ల;
నిముసమేనియు నీ వంక నిలువ నగునె!
వేగ నీ యన్నఁ గాపాడ నేగు మయ్య!

13