పుట:మధుర గీతికలు.pdf/564

ఈ పుట ఆమోదించబడ్డది


లలిత మంజీరరవములు సెలఁగ, నీదు
పాదమునఁ దన్ను సోఁకిన యాదరమున,
కుసుమబాష్పపరంపరల్‌ కురియఁజేసి
కరము శోకించు నియ్యశోకంబు గంటె?

అతివ! నీ యూర్పుతావుల ననుకరించు
పొగడపూదండ నాకయి సగము గ్రుచ్చి,
మిగిలిన సగంబు పూర్తిగా ముగియకుండ
కన్ను మోడ్చుట న్యాయమే యన్నుమిన్న?

సతము సుఖదుఃఖములయందు సములు సఖులు,
కొదమజాబిల్లి రేక నీ కొడుకుకుఱ్ఱ,
ఏనొ నీ తోడునీడనై యెనసియుందు;
నిష్ఠురము గాదె మము వీడి నిష్క్రమింప?

వీఁగె ధైర్యము, తలఁగెను భోగకాంక్ష,
గీతము లడంగె, కై సేఁత రోత పుట్టె,
వీడె క్రీడలు, ఋతువుల వేడ్క తొలఁగె;
నేఁడు నా పాన్పు శూన్యమై పాడువడియె.

9