పుట:మధుర గీతికలు.pdf/562

ఈ పుట ఆమోదించబడ్డది


అళులు రొద మాన, ముకుళించు నళినివోలె,
ముంగురులు దోఁగ, మాటలు ముడిఁగియున్న
మురువు గులికెడు నీ చిన్నిముద్దుమోము
మాటిమాటికి దెరియించె మన్మనంబు.

పగలు శశితోడ నిశికాంత బాసియున్న,
మరలఁ గూడును గావున విరహ మోర్చు;
ఎన్నటికి నీవు నను బాసి యేగియుంట,
నీదు విరహాబ్ధి నే నెట్టు లీఁదువాఁడ?

చిగురుటాకుల మెత్తని సెజ్జమీఁద
నొ త్తిగిలి పవ్వళించిన నొత్తికొనెడు
మవ్వ మగు నీదు నెమ్మేను పువ్వుఁబోడి!
మండుచిచ్చున కెట్లోర్చి యుండఁ గలదు?

నీదు మర్మంపు నర్మంపు నెయ్యురాలు
కనకమేఖల నీవు మ్రాఁగన్ను వెట్ట,
కుంది తానును మరణంబు జెందె ననఁగ,
మధుర మంజుల రవములు మానియుండె.

7