పుట:మధుర గీతికలు.pdf/560

ఈ పుట ఆమోదించబడ్డది


చిత్రముగ నాదు భాగ్యరాశిని హరింప
విధియె కల్పించియుండె నీ వింతపిడుగు;
కాకయుండిన, తరువుపైఁ బ్రాఁకు లతను
కాల్చి, విడుచునె తరువును గాల్పకుండ!

తప్పిదము నేను చేసినయప్పుడై న,
అలిగి పల్లెత్తుమా టైన నాడ వీవు?
ఏమి నేరంబు గావించి యెఱుఁగ నిపుడు,
ప్రేమతోఁ బిల్చినను పల్కరింవ వేల?

మరల రాకుండ పరలోక మరుగ నున్న
యప్పు డైనను నాతోడఁ జెప్ప వైతి,
వకట! కపటవాత్సల్యంబు నభినయించు
వంచకుఁడ నంచు నీమది నెంచి తే మొ?

ప్రాణసమ యగు నీ ప్రియపత్ని తోడ
నరుగ నెంచియు, నీ విట్లు సురిగి తేల?
చెనటిజీవమ! యింక నీ వనుభవింపు
మాత్మకృత మైన యాతన మనవరతము.

5