పుట:మధుర గీతికలు.pdf/56

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధురకవి సంక్షిప్తజీవిత చరిత్ర


ఆంధ్ర సాహిత్య రంగంలో, సంస్కరణోద్యమంలో, సామాజిక నిర్మాణాత్మక కార్యక్రమంలో నాళం కృష్ణారావు గా రందెవేసిన చేయి. అనేక రంగాలలో, అనేక కారణాలవల్ల కొందరు తమకు రావలసినంత పేరు, ప్రతిష్టలు రాకుండా కన్ను మూస్తారు. అటువంటి వారిలో వీరొకరు.

వంశ చరిత్ర :- దేశ చరిత్రలు, సాహిత్య చరిత్రలు, కవి చరి త్రలవలెనే ప్రముఖులైనవారు తమ వంశీయుల చరిత్రలను పదిల పరచు కోవటం ముదావహం. రానున్న తరాలవారికి వారి చరిత్రను తెలియ చెప్పినట్ల వుతుంది, ఆ ఉద్దేశ్యంలో నాళం రామలింగయ్యగారు 1915 మే నెలలో "శ్రీ నాళము వంశముక్తావళి" అనే గ్రంధాన్ని (డెమ్మీసైజు 32 పుటలు) వెలువరించారు. రామలింగయ్య గారిచే సంపాదింపబడి నాళం కృష్ణారావుగారిచే వచనంలో వ్రాయబడిన ఈ పుస్తకాన్ని చెళ్ళపిళ్ళ చిన వేంకట శాస్త్రులుగారు పద్యాలుచేర్చి సరిచూచారు. కాకినాడ స్కేప్ అండ్ కో, ముద్రాక్షరశాల వారు ముద్రించారు. గుంటూరుజిల్లా విను కొండతాలూకా, హరితస గోత్రీకులైన పులిపాక పార్వతీశంగారి వంశ స్తులు వీరి గురువులుగా ఆ గ్రంధంలో చెప్పబడ్డారు. ఆ యా కుటుంబాల వా రేర్పాటు చేసుకొన్న వర్తక స్థావరాలు, చేసి దాన ధర్మాలు, ఎవ రెవరే యె కాలాలలో జనన మరణాలకు లోనైందో ఆ గ్రంథములో తెలియచేయ బడ్డాయి. వారు ప్రచురిద్దా మనుకొన్న "ద్వితీయగుచ్ఛం" వెలుగు చూచినట్లు కన్పించదు.