పుట:మధుర గీతికలు.pdf/559

ఈ పుట ఆమోదించబడ్డది


ధైర్యమును వీడి బాష్పగద్గదికతోడ
ధరణిపతి యిట్లు విలపించె; త ప్తమైన
నినుము సైతము మెత్తనౌ ననఁగ, నింక.
దేహధారుల మాట చింతింపనేల?

'మేన సోఁకినయంతనే ప్రాణములను
పూలు సైతము తీయంగఁ జాలెనేని,
చెనకి జీవులఁ దెగటార్పఁ చెనగు విధికి
జగతి నెయ్యది రాకుండు సాధనమ్ము

మృదువు లై నట్టివానిని మృదువు లైన
వానిచేతనే కాలుండు బూని చంపఁ
దలఁచె కాఁబోలు, నిక్కంబు - తమ్మిపువ్వు
మంచు పడినంతమాత్రనే మాడిపోదె?

పువుల దండయె జీవంబు తివియునేని
సతము ధరియించు న న్నేల చంప దయ్యె?
విష మమృత మగు, నమృతంబు విషము నగును
అహహ! విధివిలాసం బెంత యద్భుతంబొ?

4