పుట:మధుర గీతికలు.pdf/556

ఈ పుట ఆమోదించబడ్డది

విరిదండ


నందనంబున శచితోడ నాకవిభుఁడు
మించు వేడుకతో విహరించినట్లు,
మహితగుణవతి యగు నిందుమతిని గూడి
ఉపవనంబున విహరించుచుండె నజుఁడు.

అంత, దక్షిణసాగరప్రాంతమందు
చెలఁగు గోకర్ణపురిని వేంచేసియున్న
శివుని సేవింపగాఁగోరి, దివిజమౌని
వెడలె వీణను ధరియించి విన్ను వీథి

అమ్మహామునిచేతి వీణాగ్రమందు
వ్రేలుచున్నట్టి మందారపూలమాలఁ
గడు రయంబునఁ గొనిపోయె గంధవహుఁడు,
కమ్మతావుల నానెడు కాంక్ష ననఁగ.

1