పుట:మధుర గీతికలు.pdf/555

ఈ పుట ఆమోదించబడ్డది


కదళిఫలము వోలె ఖర్జూరమును బోలె
ఇక్షురసము వోలె హిమము వోలె
సుధల జల్లు వోలె సుదతిహాసము వోలె
హాయి గూర్చు నితని దై న కవిత.

తెలుగుల మానసమ్ములను తీయని కోర్కెలు నిండ మావి కొమ్మల గమినుండి పాడు, పిక మాధురితో రసికా౦తరాత్మలన్‌ పులకల నింపి యెల్ల రకు మోదవిభూతిని గూర్చితయ్య, నీ సలలితసత్కవిత్వ సరసత్వమహత్వపటుత్వసంపదన్.

ఈ మహామనీషి రచించిన కావ్యమునకు ఆముఖమున వ్రాయగలుగుట నాభాగ్యమని భావిస్తాను. ఇట్టి భాగ్యమును నాకు కలిగించిన నిర్వాహకులందరికిని ఇవే నాకృతజ్ఞతా నమస్సుమాంజలులు.



హైదరాబాదు 32

21 - 4 - 1960

దేవత సుబ్బారావు