పుట:మధుర గీతికలు.pdf/553

ఈ పుట ఆమోదించబడ్డది

ఆలాగునే యిందులో "అన్ని విధముల సమరూపులైన మీకు సఖ్య మొనగూర్చి నలువ తాచతురుడయ్యె”

అంటాడు కవి. ఈ 'చతుర' ప్రయోగంలో చాతుర్యమూ, నాలుగు ముఖాలు ధ్వనిపూరితమైన శ్లేషలో యిముడ్చబడింది. సరళ సౌందర్యాన్ని కవి వర్ణించిన తీరు హృదయాలకు హత్తుకొనే లాగవుంది.


"విమల భానురకాంతిచే విశ్వ మెల్ల
భాసిలగ జేయు తేజోవికాసి"

అంటాడు కవి. ఆమెను రాజ్యాన్ని, సంపదనుకూడా త్యజింప గలిగిన పవిత్రప్రణయమూర్తులు సరళాసుధాకరులు. ఈ ఖండికలో కవి చెప్పదలచుకున్న మహత్తరసత్యం, పవిత్ర ప్రేమ మహదైశ్వర్యానికి కూడా అతీతమని. ఇది బహుశా King Edward VIII ని దృష్టిలో పెట్టుకొని వాసినట్లున్నది.

కృష్ణారావుగారు నామాతామహికి సోదరులు. అందు వలన నాకు తాతగారు. వారిపైగల భక్తితో వారిపై నేను గూర్చిన పద్యసుమాంజలితో యీ ఆముఖమును ముగిస్తాను .

16