పుట:మధుర గీతికలు.pdf/552

ఈ పుట ఆమోదించబడ్డది
కేరళరాణి

ఇది కవికల్పితగాధ. విషయం చిన్నదైనా శిల్పం మహోన్నతము. సరళ కేరళదేశపు రాజుగారి కుమార్తెగా పరిగణింపబడుతూవున్న దాసీకన్య. ఆరహస్యం రాజుకు, దాసికేతెలుసు. రాజుగారి మేనల్లుడు సుధాకరుడు, సరళ పరస్పరం ప్రేమించుకుని వివాహమాడ నిశ్చయించుకుంటారు. దాసి (తల్లి) వల్ల తన జన్మరహస్యాన్ని తెలిసికొని సరళ రాజ్యత్యాగం చేయడానికి ఉద్యుక్తురాలవడమే కాకుండా, సుధాకరునికి తాను వివాహార్హకాదని భావించి సన్యసింప తలపెడుతుంది. సుధాకరు డీ విషయాలను సరళవల్లనే తెలుసుకుని తనకు రాజ్యవాంఛలేదనీ, రాణి అయినా దాసి అయినా సరళే తనప్రేయసి అనీ, తన నిస్వార్ధప్రేమను ఆమెకు తెలియజేస్తాడు.

వరూధినివలెనే “ఇంపుమీరగ వీణవాయించుతూ సరళ మనకు దర్శనమిస్తుంది యీ ఖండికలో, వీరేశలింగంగారు తన శాకుంతలాను వాదంలో


“తుల్యగుణ యుక్తులగు దంపతులను గూర్చి
బ్రహ్మ చిరకాలముకు నేడు బాసెనింద" అన్నారు.

15