పుట:మధుర గీతికలు.pdf/551

ఈ పుట ఆమోదించబడ్డది


"వీకమై నేను తన మేను నాకుచుండ
తోక పై కెత్తి వీనుల దోరవైచి”

యీ వర్ణనవల్ల తువ్వ మన ఎదుట సాక్షాత్కరిస్తుంది చెంగు చెంగున గెంతుతూ. “సమ్మతించునె చావ నే జంతువేని”, “తల్లిదయలోతు నెన్నంగ తరముకాదు” యిత్యాదులు పరమ సత్యాలు ఈ వ్యంగ్యాన్ని చూడండి.


“మహిత విజ్ఞానయుతులైన మనుజులందె
మాటతప్పంగ నేరని మానధనులు
కానరారన్న, మాటికి గడ్డిగఱచు
పసరముల మాటవేఱ చెప్పంగ నేల"

“ఆడితిరిగిన చండాలుడండ్రుగాని---" లో వేమనయోగి దర్శనమిస్తాడు. చివరిఘట్టంలో గోవు తిరిగి వచ్చి తనను గ్రసింపమని పులిని వేడుతుంది. పులిమనస్సు మారిపోయిగోవును వెళ్ళి పొమ్మంటుంది. గోవు పులిని నిర్బంధిస్తుంది. “నీకు మ్రొక్కెద నాజోలిరాకుమమ్మ” అని పులిగోవును బ్రతిమాలుతుంది. అది కవికల్పించిన వినూత్న మగు మలుపు చాలాహృద్యంగా నడిచింది యీ ఘట్టం దీనివల్ల గోవుయొక్క ధర్మవీరం సువ్యక్త మవుతుంది. ఇదే కవిబ్రహ్మ తిక్కన చెప్పిన ధర్మా ద్వైతము.

14