పుట:మధుర గీతికలు.pdf/549

ఈ పుట ఆమోదించబడ్డది


"భవుని కోదండమును వంచె వాలి నొంచె
శరధి బంధించె, పంక్తికంధరుని ద్రుంచె
నీ నిమిత్తమ కాదమ్మ------”

అని సీతకు సైరణ కలిగింప యత్నిస్తాడు. ఎంతచేసినా "కడకు కడతేరదయ్యె నీకాపురంబు" అని విచారిస్తూ విషాద వార్తను చల్లగా చెబుతాడు. ఈ శబ్దప్రయోగంలో దేశీయత జాలువారుతుంది. అందులోని సీత “ముక్కు మొగమును నెఱుగని మొఱటులెవరొ----ఎగ్గులువల్క--------అంత మాత్రనెనమ్మి నాకాంతుడిట్లు, కానలకు నన్ను ద్రోయునే కరుణమాలి”, “విభుడిట్లు చేసిన నోర్చుటెట్లు", ఇంతతెగువకు ధవుడేల యిచ్చగించె" అని రామునిచర్యను నిరసిస్తూ ప్రశ్నింపగలిగినధీర , పతి తనపై చూపిన ప్రణయాన్ని కపటనాటక" మనిత్రోసిపుచ్చుతూ, రాముని మాటలునమ్మి “అన్నియు నిజమంచు మోసపోతి" అంటుంది. అంతలోనే తన దురుసుతనానికి తానే చింతించి "లోకాపవాదమునకు, పతిని గుఱిసేయ నే నెట్లు పాలువడుదు, విభునియానతిబడి యుందువిపినమందు" అని నిశ్చయించు కుంటుంది. ఇక్కడ సీత మనోవిశ్లేషణను కవి అతినైపుణ్యంతో చేస్తాడు.

12