పుట:మధుర గీతికలు.pdf/548

ఈ పుట ఆమోదించబడ్డది

అపవాదము

ఇందలివస్తువు రామాయణ ఉత్తరకాండనుంచి స్వీకరింపబడినది. ఈ ఉత్తరకాండనే కంకంటి పాపరాజు బహు రసవత్తరంగా అనువదించి మూలానికే వన్నె దెచ్చాడు. లోకాప వాదానికి వెఱచి రాముడు సీతను త్యజించి, వాల్మీకుల ఆశ్రమమువద్ద ఆమెను విడచిరమ్మని లక్ష్మణుని నియోగిస్తాడు. అక్కడ అరణ్యంలో నడచిన సీతాలక్ష్మణుల సంభాషణే కవి ఎత్తుకున్న ఘట్టము. దీనిలోకూడా నాటకీయత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సీతపాత్ర లలితమనోజ్ఞంగా మలచబడి, స్త్రీ సహజమైన ఆతురత, సౌకుమార్యము గోచరిస్తాయి. ఆమె మానసికానుభూతి అతిస్వాభావికంగా దర్శనమిస్తుంది. తొలుతనే లక్ష్మణుని విన్నబోయిన వదనాన్ని పరికించి “అన్నదమ్ములు కుశలులై యున్న వారె” అని ప్రశ్నిస్తుంది.” “ఓడితివో శత్రులకు --" అనే ఆమె మలిప్రశ్న పోతనగారి పద్యాన్నీ, "గురు నిందయాచరించితొ ---" అనే పాపరాజు గారి పద్యాన్నీ కూడా తలపిస్తుంది. “కానలకు ద్రోసిపుచ్చెనో ప్రాణవిభుడు" అని సంశయాన్ని వెలిబుచ్చుచూ, భావిని సూచిస్తుంది. రాముణ్ణి సమర్థిస్తూ లక్ష్మణుడు

11