పుట:మధుర గీతికలు.pdf/547

ఈ పుట ఆమోదించబడ్డది

విదితమవుతుంది. "రాముడెన్నగ నాదినారాయణుండు” అని వాల్మీకంలోలేని మరోవిషయాన్ని లక్ష్మణునిచేత కవి యిక్కడ చెప్పించాడు. వాల్మీకి చిత్రించిన శ్రీరాముడు "ఆత్మానం మానుషంమన్యే” అనే చెప్పుకుంటాడు, కడకు “సతులకోపంబు సైరింప శక్యమగు నే” అని లక్ష్మణునిచేత పలికిస్తాడుకవి. ఇది దక్షిణ నాయకు డనవలసిన మాట. ఇలా చెప్పించి కవి తన రాసికాన్యి తెలియపరుస్తాడు. లక్ష్మణుడు వెళ్ళిపోతూ సీత చుట్టూ ఒక గిరి గీసి దానిని దాటవద్దని ఆమెను శాసించినట్టుగా కొన్ని రామాయణాలలో వున్నది. అది అవాల్మీకం. కవి అలాంటి గిరిని గీయించకపోయినా “ఎవ్వడైనను నినుముట్టె నేని, వాడు పుడమిపై గూలుగావుత బూదియగుచు" అని శాపం యిస్తాడు. ఇదికూడా అవాల్మీకమే అయినా, యిందులో నాటకీయత ద్యోతకమవుతుంది. లక్ష్మణుని నిష్క్రమణ తరువాత, సీత ఆత్మశోధన చేసుకుంటూ


".. . . .లక్ష్మణు దూరియుంటి
కట్టి కుడుపకయున్నె యాకర్మఫలము”

అనుకుంటుంది. దాని ఫలితమే యావద్రామాయణగాధ కదా.