పుట:మధుర గీతికలు.pdf/546

ఈ పుట ఆమోదించబడ్డది

కాదు సుమా అని, ఆమె కారణజన్మఅని, యీ విధంగా మనకు తెలియబరుస్తాడుకవి.

సీత చేసిన నిందాపూరితములగు ఆరోపణలను, లక్ష్మణుడు తల్లీ అని ఆమెను సంబోధిస్తూ ఎగురగొట్టి వేస్తాడు. అంతే కాకుండా యిలాంటి నిష్ఠురాలను ఎలాగ పలుకగలిగినా వమ్మా అంటూ “మంచుముద్దను పుట్టునే మండుచిచ్చు" అంటాడు. ఇది ఇలా భావగర్భితమైన ప్రయోగం. ఇటువంటి ప్రయోగాలు కృష్ణారావుగారికే చెల్లి నవి. “.. . . . నీపాదపద్మము లనెగాని, కన్నెత్తి నీమోముకాంచి యెఱుగ" అని వాపోవుతాడు లక్ష్మణుడు. కిష్కింధకాండలో సీతయొక్క నూపురములను తప్ప తక్కిన ఆభరణాలను గుర్తింపలేనని చెబుతూ లక్ష్మణుని చేత వాల్మీకి వలికించిన


“నాహం జానామికుండలే
నాహం జానామికేయూరే
నూపురేత్వభి జానామి
నిత్యంపాదాభి వందనాత్”

శ్లోకాన్ని దృష్టిలో పెట్టుకొని కవి అనిపించినమాట. ఈ ఒక్క మాటలొనే లక్ష్మణుని శీలసంపద, యావత్తు ప్రపంచానికే

9