పుట:మధుర గీతికలు.pdf/545

ఈ పుట ఆమోదించబడ్డది

ద్యోతకమవుతుంది. ఇదికూడా అనువాదంకాదు,... ఆక్రందనంబు “వినబడెనొ లేదో యింత నీ వీనుగవకు” అంటుంది సీత. ఇది స్త్రీ సహజము. “ఎంతచెప్పినా వినబడటంలేదా” అనేమాట ప్రతీయింటా వినబడేదేకదా.” యింత నీ వీనుగవకు" అనే ప్రయోగం పెద్దనగారి" యింతలుకన్ను లుండ” ని స్ఫురింపజేస్తుంది.“ఎంత పిలిచిన మాటాడ వించుకైన, లోకూడ సహజత్వ ముట్టిపడుతూంది. సీత విసిగి పోయి రాముని సోదరులను నిందిస్తూ “మంచితమ్ముల గూర్చెరా మాయబమ్మ" అని అంటుంది. అలా ఆ దెబ్బ వెళ్ళి బ్రహ్మదేవుడికి కూడా తగులుతుంది. ఈ ఖండికలోని సీత పాత్ర చిత్రణలో వాల్మీకి రామాయణంలో కనిపింపని శిల్పం గోచరిస్తుంది.


"భ్రాతగాపాడ నీ కంత భీతియున్న
నిలిచియుండుము నీవిట, నేనెపోయి
శత్రువులనెల్ల నొక పెట్ట జక్కడంచి
స్వామిగొనివత్తు తలపువ్వు వాడకుండ

అని సీతచేత పలికిస్తూ కవి, అమెను బొత్తిగా చేతగాని దానినిగా చిత్రింపక ఒకధీరగా చిత్రిస్తాడు, సీత సామాన్యవనిత

8