పుట:మధుర గీతికలు.pdf/544

ఈ పుట ఆమోదించబడ్డది

పై డి లేడి

ఇందలి ఇతివృత్తం ఆదికవి వాల్మీకులవారి రామాయణ కావ్యంలోని అరణ్యపర్వంలోని 45వ సర్గనుండి సంగ్రహింప బడినది. సీతకోరికపై శ్రీరాముడు బంగరులేడి వెంట నరిగి, దానిపై శరప్రయోగమును గావింపగా, ఆ ఆకారములో నున్న మారీచుడు మృతినందుతూ “హాసీతా, హాలక్ష్మణా అని అరుస్తాడు. ఆ ఆర్తనాదాన్ని ఆలించి, రాము డాపదలో చిక్కు కున్నా డని సీతభావించి, రామసహాయార్థమై లక్ష్మణుని వెళ్ళ మంటుంది, అది రాక్షసమాయ అని అతడు దానికంగీకరింపడు. ఉద్విగ్న యైన సీత ఆతనిని పరుసము లాడుతుంది. చివరకు ఆమె పలికిన నిందాలాపములను సైరింపలేక, లక్ష్మణుడు రామునికి సహాయంగా వెళ్తాడు.

"పెనగి మృత్యువు పై కొన్న వేళగాని కలుగదెన్నడు నట్టి యాక్రందనంబు" అని సీత అనడంలోసత్యం లేకపోలేదు. అయితే అది మృత్యుసమయంలో మారీచు డొనర్చిన ఆక్రందనము. అది రాముడొనర్చిన దని సీత భ్రమిస్తుంది. స్నేహము కీడునే శంకిస్తుం దంటారు పెద్దలు. ఖండిక అంతటా సరళ మైన భాషలో, స్త్రీ సహజమైన ఉద్విగ్నత

7