పుట:మధుర గీతికలు.pdf/542

ఈ పుట ఆమోదించబడ్డది

వెనుక వస్తూవుండే భ్రమరాలు “వీణచాన--- విడుచు కాటుక కన్నీటి బిందువుల" వలె వున్నవట. విరిదండతాకున ఇందుమతి “మొదలునఱికిన కర్పూరకదళి" వలె పడిపోయిన దట. ఈ. "కర్పూర” ప్రయోగం మూలములోలేనిది. కర్పూరము ఎంతోకాలం వుండక హరించిపోతుంది. అలాగనే ఇందుమతి కూడా చిరుతప్రాయం లోనే అసుపులను వీడినది అని ధ్వనిస్తున్నది యీ "కర్పూరం”లో. కర్పూరకదళి తెలుగు దేశంలో నే లభ్యమవుతుంది.

అజవిలాపాన్ని పఠితల హృదయాలకు హత్తుకొనేలా చిత్రించాడుకవి, శిల్ప చాతుర్యంతో, శబ్దం కవిచేతిలో వెన్న ముద్ద లాగ మెత్తనై పోతుంది; మలచడానికి వీలుగా, చనిపోయిన ఇందుమతి” శ్రుతి దొలంగిన వల్లకి” వలెనున్నదట. అప్పుడు అజుడు " వేకువను వెల్ల బారిన విధుని” వలెనున్నాడట. ఎంతటి స్వాభావికాలు: పూలదండతాకున ఇందుమతి మరణించడం "తమ్మిపువ్వు, మంచు పడినంతమాత్రనే మాడి పోదె” అనే అర్థాంతరన్యాసతో సమర్థింపబడుతుంది. ఆ విరిదండపాటును “వింతపిడుగు" అంటాడు కవి. ఎంతభావగంభీర యుక్తమైన ప్రయోగము? మూలంలోఅజవిలాపంలో కాళిదాసు సురతప్రసక్తిని తెస్తాడు (8-51). పవిత్రమగు

5