పుట:మధుర గీతికలు.pdf/541

ఈ పుట ఆమోదించబడ్డది

ఆలంకారార్థమై ఉంచిన స్వర్గలోక కుసుమహారము గాలితాకున ఎగిరివచ్చి, ఇందుమతిని స్పృశింపగా ఆమె క్రిందపడి మరణించును. అజు డామెకై హృదయవిదారకముగా విలపించును. అతని విలాపఘట్టమే యీ ఖండికలోని ఇతి వృత్తము. ఇందుమతి పూర్వభవమున హరిణి అనేపేరుగల దేవకాంత. తృణబిందు వను మునియొక్క తపస్సుకు విఘ్న మాపాదింప ఇంద్రునిచే హరిణి నియుక్త అవుతుంది. ముని కోపావిష్టుడై మానవాంగనగా పుట్టు వందు మని ఆమెను శపిస్తాడు. ఆమె ప్రార్థింపగా, స్వర్లోకసుమహారపు తాకున మృతిచెంది, మరల నచ్చరలేమగా నగుదువని శాపమోక్షమును చెబుతాడు. ఆ విరిదండను


"కడు రయంబున గొనిపోయె గంధవహుడు
కమ్మతావుల నానెడు కాంక్షవనగ”

అంటాడు కవి. గంధవహునకే సుమసౌరరాన్ని ఆఘ్రాణించే ఆకాంక్షకలిగినదట. ఇది మూలమున కనిపింపని శిల్ప చాతుర్యము. ఇందులోని ఉపమాలంకారాలు, రూపకాలు దాదాపుగా అన్నీ కాళిదాసుని మూలంలోనివే. కాని అవి చక్కని జానుతెనుగు లోనికి అనువదింప బడినా, అవి అనువాదాలుగా కనుపింపవు, అదే కవిప్రతిభ. పూలదండ

4