పుట:మధుర గీతికలు.pdf/540

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకృతకావ్యము, విరిదండ, పైడిలేడి, అపవాదము, గోగీతము, కేరళరాణి, అను అయిదు ఖండికలసంపుటి, విరిధండ మహాకవి కాళిదాసుని రఘువంశమునుండి గై కొన బడిన అజవిలాపము. పై డిలేడి ఆదికవి వాల్మీకి కృతరామాయణారణ్యపర్వమునుండి సంగ్రహింపబడిన సీతాపహరణ గాధకు ముందలిభాగము. అపవాదము, వాల్మీకి రచన మని చెప్పబడే ఉత్తరకాండ నుండి స్వీకరింపబడిన సీతాపరిత్యాగ ఘట్టము. గోగీతము, పురాణేతిహాసప్రబంధములయందు, గోవ్యాఘ్ర సంవాదముగా చిత్రింప బడిన నీతికధ. కేరళ రాణి కవినిర్మితమగు రసవత్తరగాధ.

అజవిలాపము, రఘువంశ మహాకావ్యమున అష్టమాశ్వాసమందలిది. అజుడు వంశక ర్తయైన రఘువు తనయుడు. దశరధునితండ్రి. విదర్భరాజపుత్రికయగు ఇందుమతి, స్వయంవరాహూతులగు రాజన్యులను నిరాకరించి అజునివరిస్తుంది. ఇందుమతీ స్వయవర సందర్భమున కాళిదాసమహాకవి చెప్పిన “సంచారిణీ దీపశిఖేవరాత్రౌ " (8-67) అనుశ్లోక మా మహాకవి కెనలేని ఖ్యాతి నార్జించినది. అజుడు, ఇందుమతి, కలసి అయోధ్యలో వనవిహారం చేస్తూవుండగా, గోకర్ణ క్షేత్రమునకు గగనచారిగా పయనిస్తూవున్న నారదుని మహతికి

3