పుట:మధుర గీతికలు.pdf/54

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

v

వేదాల తిరువేంగళాచార్యులుగారి కుమారులు, ఆ కళాశాల తెలుగుశాఖా ధ్యక్షులు, శ్రీ నరసింహాచార్యులు చలం పై కూడా నాళం వారి ప్రభావ మున్నట్లు పేర్కొనటం జరిగింది, నాళం వారి పలుకు మార్ధవాన్ని సాధన ద్వారా రాబట్టుకోవటానికి రాయప్రోలు వారు ప్రయత్నించిన జాడలున్నాయని తమ అనుభూతుల నాధారంగా తెలియచేశారు. వీరేశ లింగంగారి దత్తుకుమారుడై న వీరేశలింగంగారు వ్రాసిన గ్రంథాలు కూడా కొన్ని క్రొత్త విషయాలను వెలుగులోనికి తీసుకువస్తాయని పేర్కొన్నారు. మినీకవితా ప్రచారకులు, అభ్యుదయ కవులలో ఒకరైన శ్రీ రావి రంగా రావు సభకు కృతజ్ఞతలు తెలిపారు.

వేటపాలెం

1981 సెస్టెంబరులో వేటపాలెము సారస్వత నికేతనమువారు ఏర్పాటు చేసిన సభలో శ్రీమతి లక్షీకాంతమ్మ, శ్రీ పాతూరి నాగభూష ణం, శ్రీ గద్దె శ్రీరామమూర్తి గారలతోపాటు ఈ వ్యాన రచయిత పొల్గొ నటం జరిగింది. లక్ష్మీకాంతమ్మగారు పూజ్యపాదులై న తమ తండ్రిగారి ఛాయాచిత్రాన్ని గంథాలయానికికి సమర్చించారు. శ్రీయుతులు జ్వాలా నరసింహం, సుబ్రహ్మణ్యంగారలును, గ్రంథాలయ అధ్యక్ష కార్యదర్శు లును ఆ సభా నిర్వహణంలో పాలు పంచుకోవటం జరిగింది.

బాపట్ల

16. 1. 1981 వ తేదీ శుక్రవారము నాడు బాపట్ల కళా భారతి వారి ఆధ్వర్యంలో స్త్రీ హితైషిణీ మండలిలో సభ ఏర్పాటు చేయబడింది. న్యాయవాది శ్రీ జి. వేంకట జ్వాలానరసింహశాస్త్రి అధ్యక్షతన జరిగిన యీ సభలో లక్ష్మికాంతమ్మగారితోపాటు డా. కె. వి. సత్యనారాయణా చార్యులు, నెమ్మాని సీతారామయ్య ప్రభృతులు ప్రసంగించటం జరిగింది.

బాపట్ల లోనే ఆర్యవైశ్య సంఘంవారు మరోసభను ఏర్పాటుచేశారు