పుట:మధుర గీతికలు.pdf/539

ఈ పుట ఆమోదించబడ్డది

ఫలితాలు. కృష్ణరాయాంధ్ర విజ్ఞానసర్వస్వము వీరి సంకలనము. దానిలో వీరి అపారగ్రంధ పరిశీలనాసక్తి, విశ్లేషణాశక్తి, గోచరమవుతవి వీరి భావాలు జాతీయతాస్ఫోరకాలు. అందుకే దేశీయ పదప్రయోగాలు. లోకో క్తులు వీరికవితలో ఎంతగానో చోటు చేసుకున్నాయి, మచ్చునకు కొన్ని -"కట్టు కొంగున చిచ్చును కట్టినట్లు” “కొఱవిచేబూని తలగోకికొన్న రీతి", “బొడ్డుమావియు నూడని పురిటిపాప,” “నిప్పుతునకకు చెదలంట నేర్చునమ్మ", “అంటుసంటులు,” "తువ్వ" “గుమ్మపాలు”, “మఱ్ఱిపాలు,” “చంపుమాట,” “పల్లెత్తుమాట," “అవగింజంత ఆయువు", 'గ్రుక్కెడు ప్రాణము," “చెక్కు చెదరక,” “కడుపుతీపి” - ఇత్యాదులు. అల్పాక్షర ప్రయోగముతో అనల్పార్థమును సాధింప గల నేర్పరి వీరు. పదలాలిత్యానికి వీరిది అందెవేసినచేయి. ప్రతీ శీర్షికలోనూ వీరి కవితాత్మ గోచరిస్తూ వుంటుంది. ప్రతీ గీతమూ ఓక రసరాజ్య రమావిభూతి. ప్రతీ కావ్యమూ ఒక మధుకలశము, వెన్నెల జల్లు, తెలుగు సొహితీసీమకు వీరు ఆమనికోయిల, తాత్త్విక చింతనమేకాకుండా, తార్కిక పుష్టికూడా ద్యోతకమవుతవి వీరి కవితలో, అందువల్లనే కాబోలు అర్థాంతరన్యాసాలం కారాలు విరివిగా దొరలుతవి వీరి కవితలో, తర్కానికి అవి గీటురాళ్లు కదా.