పుట:మధుర గీతికలు.pdf/538

ఈ పుట ఆమోదించబడ్డది

ఆముఖము

మధురకవి నాళము కృష్ణారావుగారి కవితా సంకలన మీ “విరిదండ*, ఇది ఒక మల్లె పూలప్రోవు. కృష్ణారావుగారు ఆగర్భశ్రీమంతులు, ఆబాల్యకవితావసంతులు, సాహితీ మంత్రోపాసి. కావ్యము వారి సాహితీ తపస్సుయొక్క మహస్సు. చిరుతప్రాయంనుంచీ కవిగా సంస్కర్తగా, జాతీయవాదిగా కృష్టారావుగారు ఎన్ని కకువచ్చినవారు. వీరిది బహుముఖప్రజ్ఞ. మితభాషి, అమృత హృదయులు, అయిన వీరు వీరేశలింగంగారి అనుయాయులు, 'మానవసేవ' అనే పత్రిక,. గౌతమీగ్రంధాలయము వీరి నిర్విరామ కృషిఫలితాలు. వీరికలంలో తేటగీత తేనెలుచిందింది. మధురకవి అనే బిరుదు వీరికి సార్థకము. తెలుగుసాహితీరంగములో చాలామంది మధురకవు లున్నారు వుంటారుకూడా. చాలామంది కవులకు బిరుదు ఒక అలంకారము. కాని కృష్ణారావుగారి విషయంలో ఆ బిరుదునకే వారు అలంకారము. వీరికవిత లలిత సుకుమార మనోజ్ఞశిరీషపేశలము. ముద్దు, పాపాయి, మీగడతరకలు, తేనెచినుకులు, విరిదండ ఇత్యాది, భావస్ఫోరకములు, విశ్లేషణాత్మకములు అయిన 10, 15 కావ్యాలు వీరి సాహితీతపః