పుట:మధుర గీతికలు.pdf/536

ఈ పుట ఆమోదించబడ్డది

వసపులు వోని పదములతో, వన్నెచిన్నెలు వెలారించు అలంకారములతో, జుంటితేనెపెరలు బురుడించు తలపుదొంతరలతో నీ కవి కవితాలతాంగి నిత్యము పిసాళించుచుండును,

పఠనయోగ్యము లగు కావ్యగీతికలలో తెనుగు తీపి, తెనుగు జిగి, తెనుగు తీరుతీయము తీగలు సాగుచున్నది. ఈ గీతికాపఠనమువలన తెనుగుబిడ్డలకు భావనాశక్తియు కవితాభి రుచియు నొకేసారి రేకెత్తి ననలెత్త గలదు.

'మధురగీతికలు' పేరిటి దామస్తోమమునుండి ఈ 'విరిదండ' వింతవింత నెత్తావుల గుబాళించి, ఆంధ్రకుమారుల పొరపొచ్చెము లేవి హృదయములకు జుబ్బనచూఱ లిచ్చుగాక!

సహదేవ సూర్యప్రకాశరావు.

iii