పుట:మధుర గీతికలు.pdf/535

ఈ పుట ఆమోదించబడ్డది

కావ్యము నైకభేదము. అందు కరుణాత్మక మైన కావ్యమునకే కళాభిజ్ఞులు పట్టము గట్టినారు. ఈ చిన్ని కావ్యములు కరుణాంచిత భావద్యోతకములు; మనోహరములు; రసోన్మీలనములు. పాలనిగ్గులు చిందువాఱు పసిపాపల నోళ్ళ కను వగు రీతుల నేర్చి, గీతికల గూర్చుటలో ఈతని 'అందె వేసిన చేయి' కరుణగీతాభివర్ణనమున పరాకాష్ఠ జెందినది.

నిజభావాభివ్యక్త్తతకు గీతీవృ త్తమును లక్ష్యముగా నుంచుకొనుట చూడ, ఈ కవి కవిత్వతత్వమహత్వమును కూలంకషముగ తఱచి జీర్ణము చేసికొన్నా డనుట తెల్లము. అంతటి సంస్కృతహృదయమునుండి సురభీకరించిన గీతా సుమపాళి తెనుగుగడ్డకు నాశాశల నాహరించుకొన్నది. ఆహరి౦ చుకొననున్నది.

కవితామూ ర్తికి నవజీవన లావణ్యము నొసగు నమేయశక్తి భాషాసరస్వతికి గలదు. ఆ సరస్వతి నేటి కావ్యరచనలలో నీ కవితిలకుని లేఖినిమొన నిలిచి లలిత లాస్యము చేసినది.