పుట:మధుర గీతికలు.pdf/534

ఈ పుట ఆమోదించబడ్డది

తొలిముద్రణ పీఠిక.

'కావ్యమునకు సత్కావ్యమని, అసత్కావ్య మనీ భేదము లేదు. సరసమా విరసమా? అని సమీక్ష, అంతే.

-ఆస్కర్‌ వైల్డి.

'విరిదండ' 'మధురగీతికలు' పేరి పూలతోటలో పూచి పూన్చిన క్రొవ్విరిదండ. దీని ప్రణేత 'మధురకవి' శ్రీనాళము కృష్ణరావుగారు. వీరి జానుకైత తెనుగునాటికి సుపరిచితము. వీరును సుపరిచితులు,

ఈ రసవత్కావ్యనేత ఆంధ్రరసజ్ఞుల గౌరవ తాత్పర్యముల నేనాడో పుణికిపుచ్చుకొన్నాడు. ఇందలి యితివృ త్తములు సహితము సకలాంధ్ర సాహిత్యసార్వభౌముల హృదయసీమల స్థాయీభావము చెంది, స్మృతిమాత్రమున నానందరసోన్మేషములై, స్వర్గలోక మర్త్యలోకములను రససూత్రములో నేకీ కృతము చేయుచున్నవి, ఇట్టి‌ నవమందార మరందనిష్యందనములగు వస్తువుల రచనాసామగ్రిగ నుపయోగించుట వలన ఈకవి సహృదయుడు.