పుట:మధుర గీతికలు.pdf/532

ఈ పుట ఆమోదించబడ్డది

తము తోడ్పడి, అనుంగు మిత్రుడైన ఆచార్య రాయప్రోలు సుబ్బారావుగారిచే 'మధురకవి' బిరుదమందిన మహనీయుడీ నాళము కృష్ణరావుగారే.

ఆనాటి పౌరహిత, దేశ సేవాకార్యక్రమములలో, ఉద్యమములలో నిస్స్వార్ధముగా పాల్గొని, నిర్వహించి, దేశస్థులకు స్ఫూర్తిని కల్గించు సచ్ఛీలాచరణదీప్తితో భరతమాతకు కీర్తి ప్రతిష్ఠాకర మైన సదుద్య మాకృతితో జీవితాంతము పాటుబడిన మధురకవి నాళము కృష్ణరాయడు నాకు పితృదేవులగుట నాభాగ్యమని గర్వించుచు ఆ మాననీయుని శతజయంత్యుత్సవసందర్చమున, నేను తలపెట్టిన వారి గ్రంథపునర్ముద్రణమునకు నాకు బాసటగా నిలిచి, ప్రోత్సాహమిచ్చి. వై శ్యకులాలంకారుడైన కృష్ణరాయని కృతులలో ఒకటైన ఈ విరిదండ కావ్యమునకు వేయి రూప్యముల విరాళమొసంగి నన్నా శీర్వదించిన పూజ్యసోదరులు, ఆస్తిక్యచూడామణి, మహాదాత, సీవాశీలి ఆంధ్రప్రదేశ్‌ ఆర్యవైశ్య మహాసభాధ్యక్షులై న శ్రీ కాసం సెట్టి రాధాకృష్ణమూర్తిగారికి ఆం. ప్ర, ఆర్యవైశ్య మహాసభవారికి నిండైన మనస్సుతో నా కృతజ్ఞతాంజలిని చెల్లించుకొను చున్నాను, నేనడిగినదే తడవుగా ఈ కావ్యమునకు శోభాదర్పణముగా ఆముఖము వ్రాసి ఈ కావ్యము నలంకరించిన, న్యాయాధిపతి, కవిశిరోమణి, సహృదయ

vii